Sreeleela: ఇలా అయితే కష్టమే అమ్మాయ్… ఆ విషయంలో మారాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలీల… ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా గట్టిగా వినిపిస్తున్న పేరు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఆల్మోస్ట్ అందరి సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం తెచ్చుకుంది ఈ యంగ్ బ్యూటీ. ధమాకా సినిమాలో తన అందం అండ్ డాన్స్ తో యంగ్ ని ఫిదా చేసిన శ్రీలీల… స్క్రీన్ పైన దుమ్ము లేపే ఎనర్జీతో కనిపిస్తుంది. టాప్ హీరోయిన్ అయిపోయే లక్షణాలు శ్రీలీలలో ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం తక్కువయ్యింది. ఆ ఒక్కటే శ్రీలీల కెరీర్ ని ముంచేలా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీల కథల విషయంలో మాత్రం మిస్టేక్ చేస్తున్నట్లు ఉంది. అనుభవం లేక ఇలాంటి తప్పులు జరుగుతున్నాయో లేక దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే ధోరణిలో ఉందో తెలియదు కానీ శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తుంది.
రీసెంట్‌గా స్కంద సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన శ్రీలీల… ఈ సినిమాతో ఫ్లాప్ ని ఫేస్ చేసింది. బోయపాటి సినిమాల్లో హీరోయిన్ కి ఎంత స్కోప్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. స్కంద సినిమాలో శ్రీలీల కూడా అలానే అయిపొయింది, సినిమా హిట్ అయినా అయ్యుంటే బాగుండేది కానీ ఫ్లాప్ అవ్వడంతో స్కంద సినిమా శ్రీలీలకి ఉపయోగ పడలేదు. ఇక లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ తో కలిసి ‘ఆదికేశవ’ సినిమా చేసింది శ్రీలీల. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన మార్నింగ్ డే నుంచే యావరేజ్, నెగటివ్ టాక్స్ ని సొంతం చేసుకుంది. స్కంద, ఆదికేశవ సినిమాల కారణంగా శ్రీలీలకి రెండు నెలల్లో రెండు ఫ్లాప్స్ పడ్డాయి. ఈ రెండు సినిమాల మధ్యలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ చేయడం వలన కాస్త బెటర్ పొజిషన్ లో ఉంది కానీ లేదంటే ఇంకొక్క ఫ్లాప్ పడితే శ్రీలీల మరో కృతిశెట్టి అయిపోయేది. కథల విషయంలో శ్రీలీల పంథా మారాల్సిన సమయం వచ్చేసింది, ఇంకా లేట్ చేస్తే భవిష్యత్తు కష్టంగా మారుతుంది. డిసెంబర్‌లో నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్టిడినరీ మేన్’, జనవరిలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలతో ఆడియన్స్ ముందుకి రానుంది శ్రీలీల… ఈ రెండు సినిమాలు ఆడితేనే ఈ హీరోయిన్ కెరీర్ బాగుంటుంది లేదంటే శ్రీలీల కెరీర్ లో కష్టాలు మొదలైనట్లే.
Also Read
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..