Sreeleela demands Double remuneration: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ లీల ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. ఆమె సినిమాలో నటిస్తే పక్కాగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ తో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు చిన్నాచితకా హీరోలతో నటించినా ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు లాంటి హీరోలతో నటించే అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్న మరిన్ని సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఈ మధ్యకాలంలో వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించమని దర్శక నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.
Ambati Rayudu : ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నా.. రానున్న కాలంలో రాజకీయాల వైపు అడుగులు వేస్తా…
ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల డేట్లు సర్దుబాటు చేయడమే ఇబ్బందిగా భావిస్తున్న శ్రీ లీల వచ్చిన అవకాశాలను మాత్రం ఏమాత్రం వదులుకోవడం లేదు. ఇక ఈ సినిమాలో నటించేందుకు ఆమె ప్రస్తుతం తీసుకుంటున్న దానికి డబుల్ రెమ్యునరేషన్ అడిగినట్లుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయితే కానీ ఈ సినిమా చేయలేనని అయినా సరే ఓకే అనుకుంటే రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతం ఆమె చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు కోటి లోపే రెమ్యునరేషన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా రెండు కోట్లకు పైగా రిమాండ్ రేషన్ అడుగుతూ ఉండడం హాట్ టాపిక్ అవుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చందాన క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు ఆమె సినిమా అవకాశాలు మాత్రమే కాదు పలు కార్పొరేట్ బ్రాండ్లు ఇతర కంపెనీలకు సైతం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.