NTV Telugu Site icon

Sreeleela: పాపం డాన్స్ కి మాత్రమే వాడుతున్నారు… పాప టైమ్ అయిపోయినట్లేనా?

Sreeleela

Sreeleela

సెప్టెంబర్ నుంచి జనవరి వరకు… గడిచిన అయిదు నెలల్లో అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీలీల. స్కంద సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది, ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది… అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో మాత్రం హిట్ అందుకుంది కానీ మళ్లీ వెంటనే ఓ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. నవంబర్‌లో రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్‌ ‘ఆదికేశవ’ సినిమా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా స్కంద, ఆదికేశవ సినిమాల కారణంగా శ్రీలీలకి రెండు నెలల్లో రెండు ఫ్లాప్స్ పడ్డాయి. ఇక డిసెంబర్ నెలలో నితిన్‌ సరసన నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా కూడా పోయింది… అలానే ఇందులో శ్రీలీల క్యారెక్టర్‌కు పెద్దగా స్కోప్ కూడా లేదు. ఎదో పాటల కోసం ఉన్నట్లుంది.

ఇలా అయితే శ్రీలీల కెరీర్ కష్టమనే మాట వినిపిస్తున్న సమయంలో… ఇంకొక్క ఫ్లాప్ పడితే శ్రీలీల మరో కృతిశెట్టి అయిపోయివడం గ్యారెంటీ అనుకుంటున్న టైమ్ లో శ్రీలీల గుంటూరు కారం సినిమాతో హిట్ కొడుతుంది అనుకుంటే మరోసారి అదే టెంప్లేట్ రోల్ ప్లే చేసింది. కమర్షియల్ సినిమాల్లో… మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్ కి చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు అనే విషయం తెలిసినా తెరపై శ్రీలీలని చూస్తే మాత్రం ఈ అమ్మాయిని పాటల కోసం మాత్రమే తీసుకున్నారా అనిపించకమానదు. మ్యూజిక్ వస్తే డాన్స్ వేయడమే పనిగా శ్రీలీల కనిపిస్తుంది, ఈ కారణంగానే శ్రీలీల ఎంచుకునే పాత్రల్లో వేరియేషన్ ప్రేక్షకులకి తెలియట్లేదు. ఇప్పటికైనా తేరుకోని గుంటూరు కారం సినిమా నుంచి, డాన్స్ మాత్రమే చేయించే రోల్స్ నుంచి శ్రీలీల బయటకి వస్తే మంచిది లేదంటే అతి త్వరలో అమ్మడు ఇంటికి వెళ్లిపోవడం గ్యారెంటీ.

Show comments