Sreeleela: పాపం డాన్స్ కి మాత్రమే వాడుతున్నారు… పాప టైమ్ అయిపోయినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ నుంచి జనవరి వరకు… గడిచిన అయిదు నెలల్లో అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీలీల. స్కంద సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది, ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది… అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో మాత్రం హిట్ అందుకుంది కానీ మళ్లీ వెంటనే ఓ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. నవంబర్‌లో రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా స్కంద, ఆదికేశవ సినిమాల కారణంగా శ్రీలీలకి రెండు నెలల్లో రెండు ఫ్లాప్స్ పడ్డాయి. ఇక డిసెంబర్ నెలలో నితిన్ సరసన నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా కూడా పోయింది… అలానే ఇందులో శ్రీలీల క్యారెక్టర్‌కు పెద్దగా స్కోప్ కూడా లేదు. ఎదో పాటల కోసం ఉన్నట్లుంది.
ఇలా అయితే శ్రీలీల కెరీర్ కష్టమనే మాట వినిపిస్తున్న సమయంలో… ఇంకొక్క ఫ్లాప్ పడితే శ్రీలీల మరో కృతిశెట్టి అయిపోయివడం గ్యారెంటీ అనుకుంటున్న టైమ్ లో శ్రీలీల గుంటూరు కారం సినిమాతో హిట్ కొడుతుంది అనుకుంటే మరోసారి అదే టెంప్లేట్ రోల్ ప్లే చేసింది. కమర్షియల్ సినిమాల్లో… మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్ కి చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు అనే విషయం తెలిసినా తెరపై శ్రీలీలని చూస్తే మాత్రం ఈ అమ్మాయిని పాటల కోసం మాత్రమే తీసుకున్నారా అనిపించకమానదు. మ్యూజిక్ వస్తే డాన్స్ వేయడమే పనిగా శ్రీలీల కనిపిస్తుంది, ఈ కారణంగానే శ్రీలీల ఎంచుకునే పాత్రల్లో వేరియేషన్ ప్రేక్షకులకి తెలియట్లేదు. ఇప్పటికైనా తేరుకోని గుంటూరు కారం సినిమా నుంచి, డాన్స్ మాత్రమే చేయించే రోల్స్ నుంచి శ్రీలీల బయటకి వస్తే మంచిది లేదంటే అతి త్వరలో అమ్మడు ఇంటికి వెళ్లిపోవడం గ్యారెంటీ.
Also Read
- DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
- Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
- Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!