NTV Telugu Site icon

Sreeleela Birthday: శ్రీలీల బర్త్ డే స్పెషల్.. ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల! మరీ ఇంత అందమా

Untitled Design (1)

Untitled Design (1)

Bhagavanth Kesari Movie Unit Unveils First Look Of Sreeleela: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సంద‌డి’ సినిమాతో యంగ్​ బ్యూటీ ‘శ్రీలీల’ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే అయినా కన్నడ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి సంద‌డితో వచ్చిన క్రేజ్‌తో శ్రీలీల వరుస సినిమాలు చేసింది. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ అయిపొయింది. ఈ కన్నడ భామ సీనియర్ హీరోలతో పాటు యంగ్​ హీరోలతో స్క్రీన్​ షేర్​ చేసుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. నేడు (జూన్ 14) శ్రీలీల బర్త్​డే. ఈ సందర్భంగా శ్రీలీల (Sreeleela Birthday) నటిస్తున్న సినిమాలలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌లను చిత్ర యూనిట్ రిలీజ్ చేశాయి.

నందమూరి బాలకృష్ణ 108వ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోలో కాజల్ అగర్వాల్‌తో పాటు శ్రీలీల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భగవంత్ కేసరి టీజర్ ఇటీవల విడుదల కాగా.. నేడు శ్రీలీల బర్త్ డే (Happy Birthday Sreeleela) సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కన్నడ బ్యూటీ నవ్వుతూ చాలా అందంగా ఉన్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరీ ఇంత అందంగా ఉంటే కష్టం అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. భగవంత్ కేసరి చిత్రం ఈ దసరాకి థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇటీవల వచ్చిన టీజర్‌లో బాలయ్య బాబు సింహంలా గర్జించాడు. అతని లుక్స్, తెలంగాణ యాస, రాయల్టీ అద్భుతంగా ఉన్నాయి. టీజర్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది.

Also Read: Team India New Captain: వెస్టిండీస్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ ఔట్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!

మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్నా ‘గుంటూరు కారం’లోనూ శ్రీలీల హీరోయిన్. నేడు ఈమె బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఇందులో విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించింది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న ఫొటోని రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే ఏకంగా మహేష్ బాబునే శ్రీలీల డామినేట్ చేసేలా ఉంది. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.