NTV Telugu Site icon

Sreeleela: గ్యాప్ ఇవ్వమ్మా.. శ్రీలీల.. కొంచెం గ్యాప్ ఇవ్వు

Sreel

Sreel

Sreeleela: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల చిన్నది శ్రీలీల. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారును తన గుప్పిట్లో పెట్టుకుంది. ఒక్క కుర్రకారునేనా.. స్టార్ హీరోలను, స్టార్ డైరెక్టర్లను అందరిని అమ్మడు ఒక ఆట ఆడిస్తుంది. మొదటి సినిమా తరువాత రవితేజ ధమాకా సినిమాలో ఆఫర్ పట్టేసి.. హిట్ కొట్టేసిన శ్రీలీల.. వరుసగా అరడజను సినిమాలను పట్టేసింది. అందులోనూ అందరు స్టార్ హీరోలే కావడం విశేషం. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్.. ఇలా వరుసగా అమ్మడు సినిమాలను లైన్లో పెట్టింది. ఇక తాజాగా నేడు శ్రీలీల బర్త్ డే. దీంతో సోషల్ మీడియా మొత్తం ఈ ముద్దుగుమ్మనే మెరుస్తుంది. హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా స్పెషల్ పోస్టర్స్ తో బర్త్ డే విషెస్ చెప్పే మేకర్స్.. నేడు శ్రీలీల పోస్టర్స్ తో సోషల్ మీడియాను నింపేశారు.

ఒకటా.. రెండా.. అమ్మడి సినిమా పోస్టర్స్ తప్ప.. మరొకటి కనిపించనంతగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారంలో ఈ చిన్నది ఎంతో పద్దతిగా పట్టు లంగా ఓణిలో కనిపించి మెప్పించింది. ఇక ఇంకోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ ను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు కనిపించింది. మరోపక్క భగవంత్ కేసరి లో గ్రామీణ యువతిగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మెడలో నల్లతాడుతో కనిపించింది. నితిన్ 32, రామ్ బోయపాటి సినిమాల్లో మోడ్రన్ లుక్ లో అదరగొట్టేసింది. ఆదికేశవలో చీరకట్టుతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అమ్మడి పోస్టర్స్ చూసిన అభిమానులు..గ్యాప్ ఇవ్వమ్మా.. శ్రీలీల.. కొంచెం గ్యాప్ ఇవ్వు .. తట్టుకోవాలిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.