Sree Vishnu: అల్లు అర్జున్ నన్ను ఆ సినిమాలు చేయొద్దన్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sree Vishnu: టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లూరి. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్ఛేసాడు. ఇక ఈ వేదికపై శ్రీ విష్ణు మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన వలనే సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చిన శ్రీ విష్ణు, బన్నీకి ఎప్పుడు ఋణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ” అల్లూరి సినిమా అందరికి నచ్చుతోంది.. ఈ సినిమా చూసాక పోలీస్ వ్యవస్థపై మీకు గౌరవం పెరుగుతోంది. ఇక అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే.. నేను ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేశా.. అది చేశాక నాకు అల్లు అర్జున్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఏదో ఊరికే స్నేహితులు ఏడిపిస్తున్నారేమో అనుకున్నా కానీ నిజంగానే బన్నీ గారు పిలిచి మాట్లాడారు. రేసు గుర్రం సెట్ లో నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని మొదటి సినిమాలోనే బాగా చేశావ్.. మంచి ఆఫర్లు వస్తున్నాయా..?అని అడిగారు. అప్పటికి మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే అన్ని సినిమాలు చేయొద్దు. ఎందుకంటే మొదట నువ్వు ఎలాంటి పాత్ర అయితే చేశావో ఆ తరువాత కూడా నీకు అలాంటి పాత్రలే వస్తాయి. కథలను చూసి ఎంచుకో.. ఇండస్ట్రీ మారుతోంది.. ఇంకో నాలుగైదేళ్ళ తరువాత అన్ని కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ యే వస్తాయి అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఇప్పటికి నేను గుర్తుపెట్టుకున్నాను.
ఇక మళ్లీ ఒకరోజు ఫోన్ చేసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో పాత్ర ఉంది చేయాలనీ అడిగారు.. వెంటనే మారు మాట్లాడకుండా చేసేసి వచ్చాను. అలా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నిజంగా అల్లు అర్జున్ కు ఉన్నది ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఉంది. ఇక్కడ ఒక్కచోటనే కాదు నేను.. కేరళలో ఒక గుడికి వెళ్ళాను అక్కడ నన్ను చూసి.. మీరు సన్నాఫ్ సత్యమూర్తి లో ఉన్నారు కదా అని అడిగారు. ఇక కరోనా వచ్చాకా ఒక ఏడాది క్రితం సర్చు అని ఒక ప్లేస్ కు వెళ్ళాను. అక్కడ కూడా నన్ను గుర్తుపట్టారు. మీరు సినిమా ఎక్కడ చూసారు అంటే యూట్యూబ్ లో చూసాం అని చెప్పారు. యూట్యూబ్ లో చూసే రచ్చ చేసిన బన్నీ ఫ్యాన్స్ ఇక పుష్ప తో పాన్ ఇండియా మొత్తం తెలిసిపోయాడు. అందరు పాన్ ఇండియా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు.. కానీ బన్నీ ఇక్కడ చేస్తే అదే పాన్ ఇండియా అయిపోతుంది. నాకు ఇంత చేసిన ఆయనకు కృతజ్ఞతగా నేనేమి చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఇప్పటివరకు నా సినిమా టైటిల్స్ లో నా పాత్రలో రెండు ఏ లు వచ్చేలా చూసుకున్నా.. అల్లు అర్జున్ పేరు ఉండేలా. ఇక ఈ సినిమాలో మాత్రమే ఒక ఏ మిస్ అయ్యింది.. అందుకే అల్లు అర్జున్ ను ఈ ఈవెంట్ కు రమ్మని పిలిచాను. ఆయన వలనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?