Sravana Bhargavi Second Marriage News Viral in Social media: ఈ మధ్య సోషల్ మీడియా దాన్ని బేస్ చేసుకుని నడిచే కొన్ని డిజిటల్ మీడియా హౌసులు చాలా దారుణంగా తయారయ్యాయి. అదిగో దున్నపోతు ఈనింది అంటే ఇంకేముంది తీసుకు వెళ్లి కట్టివేయండి అన్న చందాన పరిస్థితి తయారయింది. అసలు ఎక్కడెక్కడ విషయాలకు ఎక్కడెక్కడ లింకు పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి వార్త అలాంటిదే. సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం ఆమె హల్దీ ఫంక్షన్ లో ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడమే. ఆమె ఆ ఫంక్షన్లో ఉండగా తీసిన కొన్ని ఫోటోలను చూసి ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రచారం తెర మీదకు వచ్చింది.
Bigg Boss 7: ఒక మొక్కను కూడా చూసుకోలేకపోయావు… నువ్వేం రైతుబిడ్డవి?
నిజానికి ఆ ఫొటోలు శ్రావణ భార్గవి సోదరుడు హరీష్ హల్దీ ఫంక్షన్ లోనివి. 2022 ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్ ఫోటోలు ఇప్పుడు తెరమీదకు తెచ్చి ఆమె రెండో పెళ్లి వార్తలు వండి వాదిస్తున్నారు. నిజానికి గత ఏడాది ఇదే సమయంలో హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం జరిగింది. హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 2013 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జోడీ త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించగా వీరి సైలెన్స్ అప్పట్లో ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. అయితే అప్పటి నుంచి వీరు ఈ విషయం మీద పెద్దగా స్పందించింది లేకున్నా ఏమైనా ఉంటే అధికారికంగా ప్రకటించే వారు. అదేమీ లేదు కాబట్టి ఆ ప్రచారాలు అన్నీ ఒట్టివే అని చెప్పొచ్చు. ఏదేమైనా వారు బాగానే ఉండగానే ఇలా రెండో పెళ్లి అని వార్తలు రావడం గమనార్హం.