NTV Telugu Site icon

Spirit: ఆయన సరదా సరదాకే హీరోలని యాంగ్రీ యంగ్ మెన్స్ లా చూపిస్తాడు… ఇక పోలీస్ అంటున్నాడు చూసుకోండి మల్ల

Spirit

Spirit

సందీప్ రెడ్డి వంగ… ది మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్. చెప్పాలి అనుకున్న కథని కన్విక్షన్ తో చెప్పడంతో సందీప్ రెడ్డి వంగ స్టైల్. క్రిటిక్స్ ఏం అనుకుంటారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచన లేకుండా నేనో కథ చెప్పాలి అనుకుంటున్నా దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి చెప్తాను అనే స్టైల్ లో సినిమాలు చేస్తుంటాడు సందీప్ రెడ్డి వంగ. ఈయన సినిమాల్లో హీరోలు మామూలుగానే కాస్త హైపర్ గా ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లు రెగ్యులర్ హీరోల్లా ఉండరు. కాస్త ఓవర్ ది బోర్డ్ అగ్రెసివ్ గా ఉంటారు. మాటల దగ్గర నుంచి యాక్షన్స్ వరకూ ప్రతి ఎలిమెంట్ ని సందీప్ స్పెషల్ గా డిజైన్ చేస్తాడు అందుకే ఆయన సినిమాల్లో హీరోలు కొత్తగా కనపడుతూ ఉంటారు. ఆల్ఫా మేల్స్ లా హీరోలని చూపించే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

స్పిరిట్… ప్రభాస్ ని పోలీస్ గా చూపిస్తాను అంటూ సందీప్ హైప్ పెంచుతున్న మూవీ. అఫీషియల్ అనౌన్స్మెంట్ తప్ప పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోని ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో స్పిరిట్ సినిమా తెరకెక్కనుందని చెప్తూ సందీప్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ మాములు హీరోలని గ్యాంగ్ స్టర్ లా చూపిస్తూ ఉంటాడు, ఇక ప్రభాస్ ని పోలీస్ అంటున్నాడు… ఇంకే రేంజులో చూపిస్తాడో ఊహించుకోండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ మాటల్లో నిజముంది ఎందుకంటే సందీప్ డిజైన్ చేసే క్యారెక్టర్స్ మామూలుగానే టిపికల్ గా ఉంటాయి ఇందులో ప్రభాస్ ని ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి సందీప్ స్పిరిట్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.