Site icon NTV Telugu

Spirit : స్పిరిట్‌లో విలన్ కన్ఫర్మ్.. మొత్తానికి క్లూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కబోయే స్పిరిట్‌పై సినీ వర్గాల్లో ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను సంప్రదించినప్పటకి, రెమ్యునరేషన్, కొన్ని సీన్ల విషయంలో దీపికా పదుకొనే నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే యానిమల్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన త్రిప్తి డిమ్రినీ హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు.

Also Read : Nithin : నితిన్‌ ‘స్వారీ’లో హీరోయిన్‌గా ఫ్లాప్ బ్యూటీ..?

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో విలన్‌గా అమెరికన్ యాక్టర్ డాన్ లీ నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సమయంలో సందీప్ రెడ్డి వంగ స్పందించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా జిగ్రీస్ స్ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా, అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇందలో భాగంగా ఈ విషయం గురించి కూడా అడగడంతో “మీరు అనుకున్నట్టు జరుగుతుంది” అని క్లూ ఇచ్చాడు. అయితది అయితది అట్లానే అయితది అంటూ బదులిచ్చాడు. దీంతో డాన్ లీ విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడని అభిమానులు దాదాపుగా ఖాయం చేసుకున్నారు.

ప్రభాస్‌కు సమానంగా పోటీ ఇచ్చే శక్తివంతమైన ప్రతినాయకుడిని తెరపై చూపించాలని అభిమానులు కోరుకున్నారు. ఇప్పుడు ఆ కోరిక స్పిరిట్ తో నెరవేరబోతోంది. 2025 అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. జగపతి బాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ చివరిగా సలార్, కల్కి 2898 ఏ.డి. వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో అలరించగా, త్వరలో రాజా ది సాబ్ (డిసెంబర్ 5 విడుదల), ఫౌజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Exit mobile version