డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ అనౌన్స్‌మెంట్ నుండే ప్రకంపనలు సృష్టిస్తోంది, షూటింగ్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వకముందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా భారీ OTT డీల్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది, ప్రభాస్ క్రేజ్, సందీప్ వంగా మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ ఎంతలా ఉందంటే, సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు ‘టేబుల్ ప్రాఫిట్స్’ వచ్చేలా చేసిందని అంటున్నారు.
Also Read:Dhurandhar: సౌత్ కోటకు బీటలు: టాప్-4లోకి రణవీర్ ఎంట్రీ.. షేక్ అవుతున్న ఇండియన్ బాక్సాఫీస్!
ఈ సినిమా బిజినెస్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్, సందీప్ వంగా రెమ్యునరేషన్లు మినహాయించి, సినిమా నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు కంటే నెట్‌ఫ్లిక్స్ చెల్లించిన ఓటీటీ డీల్ మొత్తం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల థియేట్రికల్ రిలీజ్ ద్వారా వచ్చే ఆదాయం అంతా అదనపు లాభంగానే లెక్కించబడుతుంది. అంటే, సినిమా మొదటి రోజే నిర్మాతలను లాభాల్లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ వంగా చేస్తున్న సినిమా కావడం, పైగా అందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటం ఈ స్థాయి హైప్‌కు ప్రధాన కారణం, ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఏమాత్రం వెనుకాడకుండా రికార్డు స్థాయి ధరను ఆఫర్ చేసింది, మొత్తానికి, ‘స్పిరిట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో పక్కన పెడితే, బిజినెస్ పరంగా మాత్రం ఇప్పుడే ఒక కొత్త రికార్డును సెట్ చేసింది. .
