Naga Chaitanya: మెగా, అల్లు దెబ్బకు అక్కినేని ‘తండేల్’ కు తలనొప్పి..
- నాగ చైతన్య తాజా చిత్రం తండేల్
- సాయిపల్లవి చైతు రెండవ సినిమా తండేల్
- రిలీజ్ డేట్ పై తర్జన భర్జన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్. ఏపీకి చెందిన కొంత మంది జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లి, అనుకోకుండా పాకిస్థాన్ బోర్డర్లోకి ప్రవేశిస్తారు. వారిని అక్కడ పాకిస్థాన్ నేవీదళం అరెస్ట్ చేయడం, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారనే కథాంశంతో తండేల్ మూవీ తెరకెక్కుతోంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ సినిమా ఇది.
Also Read: Game Changer: ఓవర్సీస్ లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ సాధించేనా..?
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
తండేల్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ పాన్ ఇండియా భాషలలో దాదాపు రూ. 75 కోట్లతో రూపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కావాలి. కానీ అదే రోజు తండేల్ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 రిలీజ్ కానుంది. దీంతో సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ వార్తలపై రీసెంట్ ఆయ్ సక్సెస్ ఇంటర్వ్యూలో గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. ” తండేల్ సినిమా షూటింగ్ ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ముందు డిసెంబర్లో రిలీజ్ అనుకున్నాం. అయితే అదే నెలలో పుష్ప 2, గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతున్నాయి. తండేల్ సినిమాకు సముద్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీజీ వర్క్ చాలా కీలకం. సీజీ వర్క్‌పై వర్క్ చేస్తోన్న కంపెనీలు ఏమంటాయో అనే దాన్ని బట్టే తండేల్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయాలనుకుంటున్నాం. దసరా తర్వాతే తండేల్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ వస్తుందనుకుంటున్నాను” అని అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!