NTV Telugu Site icon

Fahadh Faasil : మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న మాలీవుడ్ హీరో

Fahad

Fahad

వర్సటాలిటీకి రియల్ నేమ్‌గా మారిన మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల సినిమాలలో స్టార్ హీరోల సినిమాలో నటిస్తున్నాడు. ఫహద్ ఇప్పటికే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాడు. ఇటు హీరోగా, అటు నిర్మాతగా సూపర్  సక్సెస్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్‌గా రామ్-కామ్ ప్రేమలుతో పాటు హీరోగా చేసిన మూవీ ‘ఆవేశం’ మాలీవుడ్ బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.రెండు కమర్షియల్ హిట్స్ తర్వాత.. తమిళంలో రీసెంట్‌గా వచ్చిన రజనీ వెట్టయాన్‌లో బ్యాటరీగా ఎంటర్ టైన్ చేశాడు ఫహాద్. తన క్యారెక్టర్‌కు మంచి మార్కులు వచ్చినా.. కలెక్షన్ల పరంగా సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో వచ్చిన బొగన్ విల్లియా  సినిమాలో కీలక పాత్రలో మెరిశాడు ఫహద్.

Also Read : Pushpa2 : రికార్డుల రూలింగ్ మొదలెట్టిన పుష్పరాజ్

ఈ సినిమా రివ్యూ స్ పరంగా  ఓకే అనిపించుకున్న కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమాలతో పాటు మనోరతంగల్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశాడు స్టార్ హీరో. ఇలా వరుస సినిమాలతో కన్నడ మినహాయించి సౌత్ ఇండియన్‌లో ఫుల్ బిజీ అండ్ లక్కీయెస్ట్ యాక్టర్‌‌గా ఛేంజ్ అయ్యాడు.నెక్ట్స్ ఫహాద్ ఫజిల్ టార్గెట్ తెలుగు ఇండస్ట్రీ. పుష్ప1తో భయపెట్టిన షెకావత్. పుష్ప 2తో రూల్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. పుష్ప 1లో తన యాక్టింగ్ స్కిల్ చూపించుకోలేకపోయిన ఈ హీరో పుష్ప 2లో కావాల్సినంత కంటెంట్ ఇవ్వబోతున్నాడు. ఈసినిమాతో విలనీజానికి కొత్త భాష్యం చెప్పబోతున్నాడు వర్సటైల్ యాక్టర్. మరీ పుష్ప 2 ఫహద్ ఫాజిల్  విలనిజం చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్.

Show comments