ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు పుట్టినరోజు సిడిపిని సోషల్ మీడియాలో రీలిజ్ చేశారు. ఈ సీడీపీ గతంలో కంటే భిన్నంగా, విభిన్న శైలిలో ఉంది. ఇక ఈ సీడీపీతో అప్పుడే తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలు మొదలు పెట్టేశారు అభిమానులు. మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మూడు స్పెషల్ సర్ప్రైజ్ ట్రీట్ లు రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆయనతో పని చేసిన 20 మంది సెలెబ్రిటీలు కలిసి రేపు ట్విట్టర్ స్పేసెస్ లో హంగామా చేయనున్నారు.
Read Also : “శాకుంతలం”లో బాలీవుడ్ నటుడు
ఆగష్టు 9, 1975న జన్మించిన మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ నటులలో ఒకరిగా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “భరత్ అనే నేను”లో చివరిసారిగా కన్పించిన సూపర్ స్టార్ “సర్కారు వారి పాట” చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ మూవీ తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
