Site icon NTV Telugu

Megastar Chiranjeevi: మెగా ఈవెంట్ లోడింగ్..

Megastar

Megastar

భారతదేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ… సమాజ సేవతో ప్రజలకి మంచి చేస్తూ ఉన్న చిరంజీవికి ఈ అవార్డ్ రావడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం… మెగాస్టార్ చిరంజీవికి సినీరంగానికి చేసిన సేవకుగాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ వర్గాలు… సినీ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి చిరుని కలవడం జరిగింది.

Read Also: Filmfare Awards 2024: జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్!

ఈ సందర్భంగా మెగాస్టార్ కోసం ఒక స్పెషల్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నాం, మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ఇండస్ట్రీ మొత్తం చిరంజీవిని ఘనంగా సత్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ఈవెంట్ ఎప్పుడు ఉంటుంది? ఎవరెవరు వస్తారు? టాలీవుడ్ ప్రముఖులంతా హాజరవుతారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఏదేమైనా.. పద్మ విభూషణ్ మూమెంట్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది.

Read Also:Pushpa 2: పుష్పరాజ్ తగ్గేలా లేదు మావా బ్రో…

Exit mobile version