Site icon NTV Telugu

Super Stars: ఢీ కొంటున్న దిగ్గజాలు… బాక్సాఫీస్ బద్దలే!

Super Stars

Super Stars

మామూలుగా అయితే టాలీవుడ్‌లో చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉంటుంది. అటు కోలీవుడ్‌లో అజిత్ వర్సెస్ విజయ్ వర్సెస్ రజనీకాంత్ బాక్సాఫీస్ వార్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంటుంది. ఈసారి మాత్రం వేర్వేరుగా ఈ హీరోలు టాలీవుడ్ బడా హీరోలతో పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. చిరుతో రజనీకాంత్, బాలయ్యతో విజయ్ పోటీ పడుతున్నారు. ఆగష్టు 10న రజనీ కాంత్ నటిస్తున్న జైలర్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ నెక్స్ట్ డేనే మెగాస్టార్ భోళా శంకర్‌ రిలీజ్ కాబోతోంది. జైలర్‌కు తెలుగులో పెద్దగా బజ్ లేకపోయినా, సినిమా బాగుంటే మాత్రం మౌత్ టాక్‌తో భోళా శంకర్‌కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మెగాస్టార్ సినిమాకు సాలిడ్ టాక్ వస్తే మాత్రం జైలర్ కోలీవుడ్‌కే పరిమితమవనుందని చెప్పొచ్చు కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోల బాక్సాఫీస్ వార్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Read Also: Salaar: ఎన్ని సినిమాలొచ్చినా ఈ నెల ‘సలార్‌’దే…

ఇక దసరాకు బాలయ్యతో సై అంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. బాలయ్య నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్ 19న రిలీజ్‌ కాబోతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అదే రోజు విజయ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘లియో’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. విజయ్‌కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమా కావడంతో లియో పై భారీ అంచనాలున్నాయి. అయినా కూడా బాలయ్య క్రేజ్ ముందు విజయ్ నిలబడడం కష్టమే. తమిళ్‌లో మాత్రం విజయ్‌కు తిరుగు ఉండదు. మొత్తంగా టాలీవుడ్ నుంచి ఇద్దరు, కోలీవుడ్ నుంచి ఇద్దరు దిగ్గజాలు ఢీ కొడుతుండడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Exit mobile version