Site icon NTV Telugu

SonuSood : భార్యా బాధితుడి ట్వీట్… ట్రీట్మెంట్ కావాలంటూ సోనూకు రిక్వెస్ట్

Sonusood

కోవిద్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అప్పటి నుంచి ఆయన గోల్డెన్ హార్ట్ ను చూసి రియల్ హీరో అని పిలవడం మొదలు పెట్టారు జనాలు. ఇక అదే సమయంలో సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సోనూసూద్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని, లేదా సర్జరీలు వంటి వాటికి వారి ఆర్ధిక పరిస్థితి బాలేదని ఆయన దృష్టిని వచ్చినా… వెంటనే స్పందించి, వాళ్లకు చికిత్స అందేలా చేస్తున్నారు. అలాగే తాజాగా ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు అంటూ కుటుంబ సభ్యులు సోనూసూద్ కి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్ తనను తాను భార్యాబాధితుడిగా పేర్కొంటూ తనకు కూడా ట్రీట్మెంట్ కావాలంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు.

Read Also : KGF Chapter 2 : రణధీర తలవంచే నీకు శిఖరాలు… “సుల్తానా” సాంగ్

“సోదరా సోనూసూద్… మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య నా రక్తం ఎక్కువగా తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి సోదరా… ఒక భార్యాబాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం కోసం అడుగుతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. దానికి సోనూ కూడా ఫన్నీగానే స్పందించాడు. “అది ప్రతీ భార్య జన్మహక్కు బ్రదర్… మీరు కూడా నాలాగా నాలాగే అదే రక్తంతో బ్లడ్ బ్యాంకు ప్రారంభించండి” అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు.

Exit mobile version