Site icon NTV Telugu

Sonu Sood : సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు..

Sonu Sood

Sonu Sood

Sonu Sood : ప్రముఖ నటుడు, నిర్మాత అయిన సోనూసూద్ భార్య సోనాలి కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనతో సోనూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోనూసూద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆయన కుటుంబం అంతా ముంబైలోనే నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా సోనూసూద్ భార్య సోనాలి తన మేనల్లుడితో కలిసి నాగ్ పూర్ కు వెళ్లింది. అక్కడ వీరిద్దరితో పాటు మరో మహిళ కలిసి కారులో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. కారు డ్రైవర్ అలెర్ట్ అయి పెను ప్రమాదం నుంచి బయటపడేసినట్టు లోకల్ మీడియా ఛానెళ్లు తెలిపాయి. ఈ ప్రమాదంలో సోనాలితో పాటు ఆమె మేనల్లుడు, మరో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.

Read Also : IPL 2025: నికోలస్ పూరన్ అరుదైన రికార్డు.. హిట్‌మ్యాన్ రోహిత్ వల్ల కూడా కాలే!

ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను నాగ్ పూర్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ఎవరూ కంగారు పడొద్దని సోనూసూద్ టీమ్ స్పందించింది. సోనాలికి ప్రస్తుతం ఎలాంటి సీరియస్ కండీషన్ లేదని.. ఆమె సురక్షితంగా ఉన్నట్టు అప్ డేట్ ఇచ్చింది. సోనూసూద్ వెంటనే నాగ్ పూర్ బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సోనూ భార్య త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గానే ఆయన ఫతే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Exit mobile version