జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఓ చిరు వ్యాపారిని సర్ ప్రైజ్ చేశాడు సోనూ సూద్. నగరంలోని బట్మలు ప్రాంతంలో ఉన్న మార్కెట్లో హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యాడు సోనూ. అక్కడ షమీమ్ ఖాన్ అనే చెప్పుల వ్యాపారితో మాట కలిపాడు. రెండు రకాల చెప్పుల జతలు చేతిలోకి తీసుకుని చూసిన ఆయన రేట్స్ కనుక్కున్నాడు. డిస్కౌంట్ ఇస్తావా అంటూ సరదాగా అడిగాడు. ఆ తరువాత చిరు వ్యాపారి షమీమ్ భుజంపై చేయి వేసి “మీకు చెప్పులు కావాలంటే ఇక్కడికి రండి. నా పేరు చెబితే షమీమ్ భాయ్ డిస్కౌంట్ ఇస్తాడు” అన్నాడు. షమీమ్ సైతం డిస్కౌంట్ ఆఫర్ పై సానుకూలంగా స్పందిస్తూ 20 శాతం రేటు తగ్గిస్తానని మాటిచ్చాడు!
Read Also : పిక్స్ : అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న కృష్ణ ష్రాఫ్
ఉన్నట్టుండీ శ్రీనగర్ వీధుల్లో హల్ చల్ చేసిన సోనూ సూద్ నిజానికి అధికారిక కార్యక్రమం మీద సిటీకి వచ్చాడు. జమ్మూకాశ్మీర్ ను మళ్లీ బాలీవుడ్ సినిమాలకు ఫేవరెట్ షూటింగ్ స్పాట్ గా మార్చటానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా కొత్త సినిమా పాలసీ ప్రకటిస్తోంది. ఆ కారణంగానే సోనూ సూద్ జమ్మూకాశ్మీర్ బాట పట్టాడు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. చూడాలి మరి, మున్ముందు బాలీవుడ్ సినిమాల్లో కాశ్మీర్ అందాలు ఎంత మేర కనువిందు చేస్తాయో!
