NTV Telugu Site icon

Sonu Sood: రాజకీయాల్లోకి సోనూసూద్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటుడు

Sonu Sood

Sonu Sood

Sonu Sood Reveals His Life Goal: కరోనా లాక్డౌన్ సమయంలో సోనూసూద్ ఎంతోమందికి సహాయం అందించి రియల్ హీరోగా ఎదిగినప్పుడు.. ఆయన రాజకీయాల్లోకి రావొచ్చన్న ప్రచారాలు జోరుగా సాగాయి. పలు సందర్భాల్లో అతడు వాటికి ఫుల్‌స్టాప్ పెట్టినప్పటికీ.. ప్రచారాలు మాత్రం ఆగలేదు. ఆయా సందర్భాల్లో సోనూ తప్పకుండా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మీడియా తారసపడినప్పుడల్లా సోనూకి పాలిటిక్స్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి. తాజాగా మరోసారి ఓ ముఖాముఖి కార్యక్రమంలో అతనికి మళ్లీ అలాంటి ప్రశ్నే ఎదురవ్వగా.. అతడు ఆసక్తికరమైన సమాచారం ఇచ్చాడు.

Taraka Ratna: నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం- ప్రధాని మోదీ

హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్క్ హోటల్‌లో నిర్వహించిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సోనూసూద్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేనే లేదు. అసలు పాలిటిక్స్‌లోకి వెళ్లాలన్న ఉద్దేశమే లేదు. నా జీవిత లక్ష్యం వేరే. ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి సోనూ వివరించాడు. ఒక రోజు రాత్రి తాను ఇంటికెళ్లినప్పుడు.. తన ఇంటి ముందు ఓ మహిళ కనిపించిందని, తను న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్నానని చెప్పగానే ఓ వైద్యుడ్ని సంప్రదించానన్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ డాక్టర్ స్పందించగా.. ఆమెను డాక్టర్ వద్దకు పంపించానని, ఐదు నెలల చికిత్స అనంతరం ఆమె కోలుకుందని తెలిపాడు. అలాంటి వైద్యులు ఉండడం వల్లే తాను సేవలు చేయగలుగుతున్నానని చెప్పాడు.

Worse in Narsinghi: నార్సింగీ లో దారుణం.. మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్

తాను ఇప్పటివరకు ఏడున్నర లక్షల మందికి సాయం అందించానని సోనూసూద్ పేర్కొన్నాడు. అయితే.. వారిలో 95 శాతం మందిని తాను చూడలేదని తెలిపాడు. పేదలకు సహాయం అందించడాన్ని తాను ఆపనని, తన జీవిత లక్ష్యం నెరవేరే దాకా సహాయం చేస్తూనే ఉంటానన్నాడు. ఇక తన భార్య ఓ తెలుగు మహిళ అని, తాను చేస్తున్న సేవలకు ఆమె కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని సోనూసూద్ వివరించాడు.

Show comments