Site icon NTV Telugu

Sonusood : ఘోర రోడ్డు ప్రమాదం… 19 ఏళ్ల యువకుడిని కాపాడిన సోనూసూద్

Sonusood

కోవిడ్ సమయంలో రియల్ హీరోగా మారిన సోనూసూద్ ఓ యువకుడి ప్రాణాలను కాపాడి మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్‌లోని మోగాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల బాలుడి ప్రాణాలను బాలీవుడ్ నటుడు సోనూసూద్ రక్షించాడు. సోను ప్రయాణిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు స్థితిని చూసిన సోనూ అందులో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని బయటకు తీసి, దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కారుకు సెంట్రల్ లాక్ ఉండడంతో బాధితుడిని కారు నుండి బయటకు తీసుకురావడానికి కొంత సమయం పట్టినట్టు సమాచారం. అయితే వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సకాలంలో వైద్యం పొందాడు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడట.

Read Also : Body shaming… తగిన సమాధానం చెప్పిన కాజల్

మొత్తానికి ఈ విషయం బయటకు రావడంతో మరోసారి సోనూసూద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక సోనూసూద్ సినిమాల విషయానికొస్తే త్వరలోనే విడుదల కానున్న మెగాస్టార్ ‘ఆచార్య’లో ఓ కీలక పాత్రలో కన్పించబోతున్నారు. మరోవైపు పృథ్వీరాజ్, ఫతే వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు.

Exit mobile version