Sonusood : కమెడియన్ ఫిష్ వెంకట్ రీసెంట్ గా అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కిడ్నీ వ్యాధి సమస్యలతో హాస్పిటల్ లో ఆర్థిక సాయం కోసం ఎంతో ఎదరు చూశారు. ఆయన కుటుంబం చేతులు జోడించి సాయం అడిగింది. ఎంతో మంది హెల్ప్ చేసినా ఆయన ప్రాణాలు దక్కలేదు. ఆ టైమ్ లో నటుడు సోనూసూద్ వారి కుటుంబానికి లక్షన్నర సాయం చేశారు. అంతే కాకుండా వారి కుటుంబాన్ని కలుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు హైదరాబాద్ కు వచ్చిన సోనూసూద్.. అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లారు. ఆయన ఫొటోకు నివాళి అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also : Upasana : ఉపాసనకు కీలక బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్..
ఫిష్ వెంకట్ అదుర్స్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించారు. అదుర్స్ తర్వాత పెద్ద సినిమాల్లో కామెడీ విలన్ గా అలరించారు. గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, శివం లాంటి సినిమాలతో అలరించారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. అడ్డగుట్టలోని చిన్న ఇంట్లో ఆయన ఫ్యామిలీతో జీవిస్తున్నారు. కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకున్నారు. కిడ్నీ మార్చాలని డాక్టర్లు సూచించడంతో దాతల కోసం ఆయన ఫ్యామిలీ చాలా ట్రై చేసింది. కానీ కుదరకపోవడంతో చివరకు వెంకట్ చనిపోయారు. ఆ టైమ్ లో టాలీవుడ్ నుంచి ఎవరూ సాయం చేయలేదనే విమర్శలు సోషల్ మీడియాలో చాలా వినిపించాయి. ఆయన చనిపోయాక ఎంతో మంది నివాళి అర్పించారు.
Read Also : Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..