Site icon NTV Telugu

Sonali bendre: క్యాన్సర్ ని జయించిన ముద్దుగుమ్మ రీ ఎంట్రీ చాలా స్పెషల్

sonali bendre

sonali bendre

మురారి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే.. ఈ సినిమాలో మహేష్ సరసన సోనాలి నటన తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిత్యం నిలిచే ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించి సోనాలి 2013 లోనే సినిమాలకు గుడ్ బై చెప్పి.. ప్రేమించిన వాడిని వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక ఆ తరువాత అనుకోని విధంగా ఆమె క్యాన్సర్ బారిన పడి నరకం అనుభవించింది. అయినా భయపడకుండా న్యూయార్క్ లో కొంత కాలం ట్రీట్ మెంట్ తీసుకొని క్యాన్సర్ ని జయించింది.

అనంతరం క్యాన్సర్ మహమ్మారి వలన కోల్పోయిన మునుపటి రూపాన్ని తిరిగి సంపాదించుకున్న సోనాలి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న చిత్రంలో సోనాలి ఒక కీలక పాత్రలో నటించనున్నదని టాక్ వినిపిస్తుంది. క్యాన్సర్ ని జయించిన సోనాలి ప్రస్తుతం తన కుటుంబంతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తుంది. సినిమాల్లోకి మళ్లీ రావాలన్న కోరిక తనకు లేకపోయినా పాత్ర కోసం మేకర్స్ సోనాలిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సోనాలికే కాదు ప్రేక్షకులకు స్పెషల్ అనే చెప్పాలి. మరి 19 ఏళ్ళ తరువాత అమ్మడి రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version