Son Of India: ఈ సొసైటీలో చెత్తనాకొడుకులను ఏరిపారేస్తా అంటున్న మోహన్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలెక్షన్ కింగ్, డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. చిత్ర కథానాయకుడు మోహన్‌బాబు అదనంగా దీనికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో గురువారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో మోహన్ బాబు తనదైన శైలిలో సంభాషణలు చెప్పి మెప్పించారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు బేసికల్ గా మంచి రైటర్ కావడంతో మోహన్ బాబు నోట తూటల్లాంటి డైలాగ్స్ పలికించారు.
”ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. ప్రపంచమంతా నా కుటుంబం. ప్రపంచం బాధే నా బాధ. స్వామి… ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… నేను దాన్నే ఫాలో అవుతున్నా… డబ్బున్నోడికి ఓ న్యాయం… డబ్బులేనోడికి ఓ న్యాయం… పవర్ ఉన్నోడికి ఓ న్యాయం… పవర్ లేనోడికి ఓ న్యాయం… డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉంటే ఎలా… అయ్యోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నాను… ఈ సొసైటీలో చెత్త నా కొడుకులని, క్రిమినల్ నా కొడుకులని ఏరిపారేయాలి… నీ ప్రశ్నలన్నింటికి సమాధానం నీతో పాటు 135 కోట్ల ఇండియన్స్ కి చాలా డిటైయిల్డ్ గా చెబుతాను…” అంటూ మోహన్ బాబు పలు సందర్భాలలో పలికి సంభాషణలతో ఈ ట్రైలర్ సాగింది. మోహన్ బాబు మార్కు డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
Also Read
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
- Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!