NTV Telugu Site icon

Karate Kalyani: నన్ను చంపడానికి వారు ప్లాన్ చేశారు..

Karate

Karate

Karate Kalyani: టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కృష్ణ లో బాబీ అంటూ రెచ్చగొట్టి.. మిరపకాయ్ లో అబ్బ.. అంటూ పిలిచి ఇప్పటికీ మీమ్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది కరాటే కళ్యాణి. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వివాదాలకు దగ్గరగా ఉంటుంది. హిందువుల మీద కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా.. అవమానించినా.. కరాటే కళ్యాణి అక్కడ వాలిపోతుంది. ఇక ఈ మధ్యనే ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అయితే కరాటే కళ్యాణి, హిందూ సంఘాలతో కలిసి కోర్టు వరకు వెళ్లి స్టే తీసుకొచ్చింది. ఇక అప్పటినుంచి ఆమెపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కక్ష కట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. తనను వారు చంపాలని చూస్తున్నట్లు ఆరోపించింది.
Adipurush: ఏమయ్యా ఓం రౌత్.. తిరుమల కొండపై హీరోయిన్ తో ఏంటా పాడు పనులు

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ” నాపై హత్యా ప్రయత్నం జరిగింది. కొద్దిలో తప్పించుకున్నాను. ఈ మధ్య నా కారు రెండు టైర్లను ఎవరో కోసేశారు. నాకు అది తెలియాకపోవడంతో అదే కారులో ప్రయాణించా.. టైర్లు రెండు పేలిపోయి.. కారు ప్రమాదానికి గురైంది. కొద్దిలో బతికి బయటపడ్డాను. కారును మెకానిక్ షాప్ కు తీసుకెళ్లి చూపించగా.. ఎవరో కావాలనే టైర్లను కోసేశారని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకోవడంతో కక్ష కట్టిన ఫ్యాన్స్ కొందరు ఈ పని చేసారని అనుకుంటున్నాను” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments