పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్” సినిమా హిందీ వెర్షన్ కోసం చార్ట్‌బస్టర్ “ఆషికి ఆ గయీ” సాంగ్ తో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా “రాధే శ్యామ్” హిందీ వెర్షన్ నుండి రెండవ సింగిల్ “సోచ్ లియా” సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. “సోచ్ లియా”ను బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ అర్జిత్ సింగ్ పాడారు. మిథున్ స్వరపరిచారు. మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు. ఎమోషనల్ గా సాగుతున్న ఈ సాంగ్ టీజర్ చూస్తుంటే ప్రేరణ, విక్రమాదిత్య మధ్య ఏదో అంతరం పెరిగినట్టు అన్పిస్తోంది.
Read Also : కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఫైర్… నోటీసులు జారీ
ప్రభాస్, పూజా హెగ్డేల పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న “రాధేశ్యామ్”కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్-ఇండియా బహుభాషా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృష్ణం రాజు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ దీనిని సమర్పిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.