NTV Telugu Site icon

Shobita: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని..

Untitled Design (7)

Untitled Design (7)

అక్కినేని శోభితా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యం అయిన, పండుగలైన , తన జీవితంలో జరిగిన ఎలాంటి సంఘటనలు అయిన తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. డిసెంబర్ 4న, ఇరు కుటుంబాల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియో వేదికగా , వీరిద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ ఈ పెళ్ళి గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి.

చై ఇష్టం లేకుండా చేసుకున్నాడు, నాగార్జున బలవంతం మీద చేసుకున్నాడు ఇలాంటి పుకార్లు చాలా వినిపించాయి. ఏదేమైనప్పటికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ రావడం అనేది అదృష్టంతో కూడుకుంది. నాగచైతన్య, శోభితకు ఈ పెళ్ళి అలాంటిదే. మరి ఈ బంధాన్ని ఎంత వరకు నిలుపుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే పెళ్లి చేసుకుని రెండు నెలలు కూడా పూర్తికాకముందే గుడ్ న్యూస్ చెప్పింది శోభిత. ఏంటి అంటే..

‘ది మంకీ మాన్’ అనే సినిమాలో శోభిత నటించింది. ఇప్పుడు ఆ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్ లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ‘రాటన్ టమాటోస్ టు బెస్ట్ రివ్యూడ్’ మూవీ గా కూడా అగ్ర స్థానం సంపాదించింది. ఈ సినిమాకు ఇటీవల బాఫ్తాలో కూడా ‘బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్’ మూవీస్ క్యాటగిరి లో కూడా చోటు సంపాదించుకుంది. దీంతో తను నటించిన ఈ సినిమా ఇలా సక్సెస్ అందుకోవడం కలనా? నిజమా? అంటూ శోభిత ఇన్ స్టా లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం శోభిత పెట్టిన ఆ పోస్ట్‌ నెట్టింటా వైరల్‌ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.