Allu Shireesh : అల్లు అరవింద్ మూడో కొడుకు అల్లు శిరీష్ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. సినిమాలకు చాలాకాలంగా గ్యాప్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గానే తన పెళ్లి ప్రకటన చేశాడు అల్లు శిరీష్. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు నయనికతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్, డిసెంబర్లో పెళ్లి ఉండబోతోంది. అయితే నయనిక ఫొటోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో బయటకు రాలేదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఆమె ఫొటోను బయటపెట్టింది. దీపావళి సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో అల్లు శిరీష్ కు కాబోయే భార్య నయనిక కూడా వచ్చింది. వీళ్ళందరూ కలిసి దిగిన ఫొటోను ముందుగా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Read Also : Samantha : మళ్లీ దొరికిపోయిన సమంత.. రాజ్ ఇంట్లో దీపావళి వేడుకలు
అయితే అనుకోకుండా అందులో నయనిక ఫేస్ కనిపించింది. కానీ తర్వాత ఆమె ముఖం కనిపించకుండా ఫోటోను పక్కకు పోస్టును ఎడిట్ చేసింది స్నేహా. కానీ అప్పటికే అభిమానులు ఆ ఫోటోను డౌన్లోడ్ చేసి శిరీష్ కు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ఈ ఫోటోలో అల్లు శిరీష్ పక్కన తన కాబోయే భార్య కూర్చుంది. చూడటానికి చాలా అందంగా ఉంది. సంప్రదాయ బట్టల్లో మెరిసిపోతోంది అల్లు వారి కొత్త కోడలు. అయితే పెళ్లికి ముందే శిరీష్ ఇంట్లో కొత్త కోడలు కనిపించడంతో సందడి మామూలుగా లేదు. ఇక అరవింద్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను స్నేహ రెడ్డి చాలానే షేర్ చేసింది. అల్లు అయాన్, అర్హ చేసిన సందడి ఆకట్టుకుంటుంది.
Read Also : Varun Tej : కొడుకుతో వరుణ్, లావణ్య దీపావళి వేడుకలు..
