NTV Telugu Site icon

SKN: మెగా ఫ్యాన్సే చిరంజీవిని తొక్కేస్తున్నారు.. SKN సంచలన వ్యాఖ్యలు

Chiru

Chiru

SKN: మెగా అభిమాని, నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో SKN ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే బేబీ సినిమాతో నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసుకొనే SKN ను పిలిచి తమవద్ద పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అలా అతని కెరీర్ మొదలయ్యింది. ఇక బేబీ సినిమా తరువాత SKN జీవితం మారిపోయింది. ఇక మొదటి నుంచి కూడా మెగాస్టార్ గురించి కానీ, ఆయన సినిమాల గురించి కానీ.. విమర్శలు వస్తే మాత్రం SKN అస్సలు ఊరుకోడు. ఇప్పుడు కూడా భోళా శంకర్ సినిమాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై ఆయన మాట్లాడాడు. తాజాగా ఈ విషయమై ఆయన స్పందిస్తూ.. మెగా ఫ్యాన్సే చిరంజీవిని తోక్కేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Siddharth Chandekar: తల్లికి రెండో పెళ్లి చేసిన హీరో సిద్దార్థ్.. ఫొటోస్ వైరల్

“ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా మొదట టికెట్ కొనేది మెగా ఫ్యాన్ మాత్రమే.. నేను.. నా కో- మెగా ఫ్యాన్ ను నమ్మాను. వాళ్లు నా సినిమాను హిట్ చేస్తారు అనే నమ్మకంతోనే బేబీ తీశాను. అలాగే చేశారు. ఇక భోళా శంకర్ ప్లాప్ కావడానికి మెగా ఫ్యాన్సే కారణం. ఆయన సినిమా నచ్చితే మొదట జై కొట్టేది వారే .. నచ్చకపోతే మొదట తొక్కేసేది వారే. థియేటర్ నుంచి వచ్చిన వెంటనే.. ఫస్టాఫ్ ఇలా ఉంది.. ఇంటర్వెల్ ఇలా ఉంది .. క్లైమాక్స్ ఇలా ఉంది అంటూ చెప్పేస్తాం. నాకు తెలిసినంత వరకు బాస్.. భోళా శంకర్ సినిమాలో కనిపించినంత స్టైల్ గా ఇంకే సినిమాలో కనిపించలేదు. 40 ఏళ్ళు రాగానే స్టెప్స్ వేయలేక కుదేలైన హీరోలు ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 70 ఏళ్ల వయస్సులో కూడా అదే గ్రేస్ తో బాస్ డ్యాన్స్ చేస్తూ చెమటలు పట్టిస్తున్నాడు. అది ఆయన విల్‌ పవర్‌. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే దానికి కారణం మనమే. ఇక అన్ని రీమేక్స్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రీమేక్స్‌ చేయాలా? ఒరిజినల్‌ చేయాలా? అనేది బాస్‌కు తెలుసు. సినిమా అంటే ఆయనకు అమ్మకం కాదు నమ్మకం.. మోకాలి సర్జరీ చేయించుకొని కూడా మనకోసం ఇంకా కష్టపడుతున్నాడు. ఆయనకు సపోర్ట్ చేయకుండా.. ఇలా మాట్లాడడం పద్దతి కాదు. ఆయన వెంట మనం ఉంటే.. ఎవరు మనల్ని కొట్టలేరు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.