Site icon NTV Telugu

SKN: మూడేళ్లు ఎన్నో అవమానాలను భరించాం.. కష్టపడ్డాం.. సాధించాం!

Skn Emotional On Baby Movie

Skn Emotional On Baby Movie

SKN Emotional Note on Baby Movie Sucess: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, హర్ష చెముడు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం నాడు అంటే జులై 14 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఒకరోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కొన్ని ప్రాంతాలలో ముందుగానే రిలీజ్ చేశారు. సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే వస్తోంది. యూత్ లో ఉన్న అందరూ సినిమా బావుందని కామెంట్ చేస్తుంటే మిగతా వారంతా ఇదేమి సినిమా రా బాబు అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదైతేనేం సినిమా దర్శక నిర్మాతలు అయితే సినిమా హిట్ అయిందని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాను నిర్మించిన ఎస్కేఎన్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పంచుకున్నారు.

Venky Re Release: వెంకీ రీరిలీజ్.. సీట్లు జాగ్రత్తమ్మా

సంధ్య 70ఎంఎంలో బేబీ మూవీ చూశానని ఎక్కడైతే తన అభిమాన హీరోల ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు చూసి ఆనందించానో అక్కడే ఈ సినిమా చూశా అసలు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా చాలా ఎమోషనల్ గా అనిపిస్తోంది ఆనందభాష్పాలు ఆగటం లేదు అంటూ రాసుకొచ్చారు. ఇలా ఈ సినిమా రిజల్ట్ చూసేందుకు దాదాపు మూడేళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, కష్టపడ్డాం, ఈ బేబీ సినిమా నా లైఫ్ టైం మెమరీగా ఉండి పోతుంది, అవును ఇది నా లైఫ్ టైం మెమరీ. కళ్ళ నుంచి నీళ్లు ఆగటం లేదు. సినిమానే నా ఊపిరి, జీవితం. అభిమానులందరికీ చాలా థ్యాంక్స్, ఇలాంటి రెస్పాన్స్ నేను ఊహించలేదు. నా స్నేహితుడు, డైరెక్టర్ సాయి రాజేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే నా టీం మొత్తానికి కూడా స్పెషల్ థాంక్స్ అని చెబుతూ ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్ గాని వంటి వారి పేర్లను ఆయన టాగ్ చేశారు.

Exit mobile version