NTV Telugu Site icon

SJ Suryah: శ్రీదేవి తరువాత ఆమెనే.. పవన్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Surya

Surya

SJ Suryah: ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి నటుడిగా కొనసాగుతున్నాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషీకి దర్శకత్వం వహించింది ఆయనే. ఈ సినిమా తరువాత వీరి కాంబోలో కొమరం పులి వచ్చింది. అయితే ఇది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేక పోయింది. ఇక ప్రస్తుతం డైరెక్షన్ మానేసి పూర్తిగా నటుడిగా మారిపోయాడు సూర్య. విలన్ గా, హీరోగా ఆయన నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఎస్ జె సూర్య.. మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. విశాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సూర్య సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా ఈ డైరెక్టర్ కమ్ నటుడు.. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీకి బర్త్ డే విషెస్ తెలిపాడు. నేడు ఈ ముద్దుగుమ్మ తన 31 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Sujitha: ‘వదినమ్మ’ వదిన స్టార్ హీరోయిన్ అని తెలుసా.. వారి విడాకులు.. ?

ఇక ఈ నేపథ్యంలోనే ఎస్ జె సూర్య కియారా ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపాడు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ” హ్యాపీ బర్త్ డే ప్రెట్టి ప్రిన్సెస్ కియరా అద్వానీ.. శ్రీదేవి తరువాత.. మీరే నేను చూసిన అత్యంత ప్రతిభావంతురాలైన నటి.. ఈ ఏడాది మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో ఆమెను శ్రీదేవితో పోల్చడం చాలామందికి మింగుడు పడడం లేదు. చాలామంది ట్యాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారు.. కియరా కన్నా అద్భుతమైన నటీమణులు ఉన్నారు.. శ్రీదేవితో ఎలా పోలుస్తారు అని కొందరు.. అయితే మరి జాన్వీ కపూర్ ఏంటి.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments