Saripodhaa Sanivaaram: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే.. సినిమా హిట్ కొట్టాల్సిందే. ఒక నటుడు ఎలా నటించాలి అనేది డైరెక్టర్ చేసి చూపిస్తాడు. అదే ఒక డైరెక్టరే నటుడిగా మారితే ఎస్ జె సూర్యలా ఉంటాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను డైరెక్ట్ చేసిన ఎస్ జె సూర్య ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారిపోయాడు. ఆయన నటించిన ప్రతి సినిమా విజయాన్ని అందుకుంది. గతేడాది వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్ లో ఎస్ జె సూర్య నటనకు ఫిదా కానీ వారుండరు. ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ నటుడు.. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో భాగమయ్యాడు. హాయ్ నాన్న తరువాత నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ కాంబోలు ఇప్పటికే ప్రేక్షకులకు సుపరిచితం. నాని- వివేక్ ఆత్రేయ అంటే సుందరానికీ సినిమాతో వచ్చారు. నాని- ప్రియాంక మోహన్ గ్యాంగ్ లీడర్ సినిమాతో మెప్పించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోకి ఎస్ జె సూర్య జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కెమెరాను చూపిస్తూ.. ఎస్ జె సూర్య ను బ్లర్ గా చూపించారు. ఇందులో ఆయన నానికి విలన్ గా నటిస్తున్నాడు అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
