Six Months Jail Sentence For Actress Jayaprada: సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకి జైలు శిక్ష విధించిన ఘటన హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో నటించిన జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరపున పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత పార్టీలో అంతర్గత పోరుతో సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2004 నుండి 2014 వరకు, ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా కూడా పని చేసి 2019లో బిజెపిలో చేరారు. అలా ఒకపక్క రాజకీయ, సినీ రంగాల్లో జెండా ఎగురవేస్తున్న జయప్రదకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె సొంతంగా నిర్వహిస్తున్న థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికులకి ప్రభుత్వ బీమా కార్పొరేషన్ భవిష్య నిధి సొమ్ము చెల్లించలేదన్న ఫిర్యాదు తెర మీదకు వచ్చింది.
Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…
ఈ క్రమంలో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జయప్రద సహా ముగ్గురు వ్యక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును పరిశీలించిన చెన్నై ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలల స్వల్పకాలిక శిక్ష విధిస్తూ ఆదేశించింది. నిజానికి ఆమె వార్తల్లోకి రావడం ఇది మొదటి సారి ఏమీ కాదు. కొన్నేళ్ల క్రితం జయప్రద థియేటర్ కాంప్లెక్స్‌కి రూ. 20 లక్షల ఆదాయపు పన్ను చెల్లించలేదు. అపుడు సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు థియేటర్‌లోని కుర్చీలు, ప్రొజెక్టర్, ఫిల్మ్ రోల్స్‌ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు తక్షణ వాయిదా కింద రూ.5 లక్షలు ఇవ్వగా, అధికారులు ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)గా చెల్లించాలని అప్పుడు డిమాండ్ చేశారు. నటి జయప్రదతో పాటు మరో ముగ్గురికి 5 వేల చొప్పున జరిమానా విధించింది కోర్టు. మరి చూడాలి ఈ విషయంలో ఏమి జరగనుంది అనేది.