NTV Telugu Site icon

Tollywood Releases: ఈవారం బాక్స్ ఆఫీస్ బరిలో అరడజను తెలుగు సినిమాలు

Tollywood Releases

Tollywood Releases

Six films to compete next week in Tollywood: ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం నాడు కూడా చాలా చిన్న సినిమాలు రిలీజ్ కి కర్చీఫులు వేసుకున్నాయి. సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్పు అనేక సినిమాల రిలీజ్ డేట్ల మార్పుకు కారణం అయింది. ఇక ఈ క్రమంలో వచ్చే వారం అంటే అక్టోబర్ 6న ఏకంగా అర డజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కి రెడీ అయిన సినిమాల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఒక వారం వాయిదా పడి అక్టోబర్ 6న రిలీజ్ అవుతోంది. సుధీర్ బాబు భిన్న పాత్రలలో కనిపిస్తున్న మామా మశ్చీంద్ర సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది.

Dil Raju : గేమ్ చేంజర్ విషయంలో కంగారు పడుతున్న దిల్ రాజు..?

ఈ సినిమాకి రచయితా, నటుడు హర్ష వర్ధన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక అదే రోజు జూ. ఎన్టీఆర్ బావమరిది హీరోగా నటిస్తున్న మాడ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అభయ్ నవీన్ హీరోగా నటిస్తున్న రాక్షస కావ్యం అనే చిన్న సినిమాతో పాటు నవీన్ చంద్ర హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన మంత్ ఆఫ్ మధు అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరకెక్కిన 800 సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది. మరి ఈ ఆరు సినిమాలో ఏయే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనుకున్నాయి అనేది చూడాలి మరి.

Show comments