Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్ ఉన్న శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. మొదటి నుంచి కూడా తనకున్న పెద్దరికంతో మంచి, చెడు చెప్తూ తనదైన ఆటను ఆడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రెండు వారాల క్రితం ప్రశాంత్ ను కెప్టెన్ గా చేయడానికి.. గేమ్ ఆడి భుజానికి గాయం తగిలించుకున్నాడు. ఇక ఆ భుజం నొప్పి వలనే.. గత రెండు వారాల నుంచి ఫిజికల్ టాస్క్ ల్లో ఆడలేకపోతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. నామినేషన్స్ లో, కెప్టెన్సీ టాస్క్ టైమ్ లో శివాజీని బాధ పెడుతున్న ఒకే ఒక్క కంటెస్టెంట్ అమర్ దీప్. మొదటి నుంచి శివాజీ.. ప్రశాంత్ కు, యావర్ కు సపోర్ట్ చేస్తున్నాడని.. అక్కసుతో ప్రతిసారి శివాజీని నామినేట్ చేస్తూ వస్తున్నాడు.
Anukunnavanni Jaragavu Konni: ఇంట్రెస్టింగ్ గా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్
ఇక తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో ఈ హౌస్ లో ఉండే అర్హత లేదు అని మరోసారి శివాజీని అమర్ నామినేట్ చేశాడు. అందుకు శివాజీ ఒప్పుకోలేదు. ఎందుకు నాకు అర్హత లేదు అని అంటున్నావ్ అని అడుగగా.. టాస్క్ లు ఆడడం లేదు. ఒక వేళ ఆడినా.. మిగతా వారికంటే ఎక్కువ ఆడలేదు అని నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ఆ తరువాత బిగ్ బాస్ .. శివాజీని పిలిచి ఎలా ఉన్నారు అని అడుగగా.. అస్సలు ఏం బాలేదని.. ఇంట్లో వాళ్లు తనను డిజర్వ్ కాదని చెప్పడం తనకు చాలా బాధగా ఉందని .. అందరి ముందు నవ్వుతు ఏడుస్తున్నానని.. ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఏడుస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి శివాజీ బిగ్ బాస్ ను వదిలి వెళ్తాడా.. ? లేదా అనేది చూడాలి.