Site icon NTV Telugu

హైదరాబాదీ రుచులను టేస్ట్ చేసిన కోలీవుడ్ హీరో

shiva karthikeyan

shiva karthikeyan

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హైదరాబాద్ లో సన్ది చేశారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఫేమస్ రెస్టారెంట్ 1980’s మిలటరీ హోటల్ ని సందర్శించారు. అక్కడ ఫేమస్ హైదరాబాద్ రుచులన్నింటిని టేస్ట్ చేసి లంచ్ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హైదరాబాద్ వంటకాలు అంటే తనకు చాలా ఇష్టమని శివకార్తికేయన్ పలు సందర్బాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక త్వరలో ఈ హీరో తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ తో ఎంటర్ అవ్వబోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే శివ కార్తికేయన్ తెలుగు రుచులకు కూడా అలవాటు పడుతున్నాడు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఏ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్ లో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version