ఆ మధ్య ‘సీతారామమ్’లో ఎంతో సంప్రదాయంగా కనిపించి మురిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్య రెండంటే రెండు పీసుల గుడ్డ కట్టుకొని, బికినీగా చెప్పి మరీ రచ్చ చేసింది. “పుట్టినప్పుడూ బట్ట కట్టలేదు… అది పోయేటపుడు మరి వెంటరాదు…” అంటూ వేదాంతసారం వినిపిస్తోంది మృణాల్. కంటికి కనిపించే మనుషులు- కనిపించని వారి మనసులు వేరుగా ఉంటాయనీ అంటోంది మృణాల్. కొందరు మనుషులు మాటలతోనే మాయ చేస్తారని, అలాంటివారు చిత్రసీమలో తరచూ తారసపడుతూ ఉంటారన్న సత్యాన్ని చాటిచెబుతోంది అమ్మడు. ఇంతగా మృణాల్ ఈ మాటలు ఎందుకు వల్లిస్తోంది అంటే, ఇప్పటికీ సింగిల్ గా ఉన్న మృణాల్ కు అప్పుడే కొందరు ప్రేమకథలు అల్లేశారట! దాంతో చిర్రెత్తుకు వచ్చిన అమ్మాయిగారు “అందం చూడవయా… ఆనందించవయా…” అంటూ బ్లూ కలర్ బికినీలో మొన్న రచ్చచేసిందట!
చిత్రసీమలో అడుగుపెట్టాకే తనకు లోకం అంటే ఏమిటో తెలిసిందనీ, అయితే అసలైన లోకం మాత్రం మన చుట్టూ ఉన్నదేననీ అంటోంది. ఒకటి అర్థమై, మరోటి అర్థం కాకుండా మాట్లాడుతున్న మృణాల్ ను చూసి కొందరు విస్తుపోతున్నారు. అదేమంటే, అసలైన జ్ఞానం అలాగే ఉంటుందనీ అమ్మాయిగారు సెలవిచ్చారు. ఎవరూ ఎవరికీ జంక వలసిన పనిలేదని, మీరు కూడా ఏ మాత్రం భయపడవద్దని అంతర్జాలంలో తనను అనుసరించేవారికి హితవు చెబుతోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకెంత వేదాంతం వినిపిస్తుందో చూడాలి.
