Site icon NTV Telugu

Sitara Ghattamaneni: బంగారుకొండ సితార.. ముద్దుపెట్టుకున్న బామ్మ.. వీడియో వైరల్

Sithara Viral Video

Sithara Viral Video

Sitara Ghattamaneni Cutest Video Goes Viral in Social Media: సామాజిక మాద్యమాల్లో ఈ మధ్య సోషల్‌ సెలబ్రిటీగా మారిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా చలనచిత్ర రంగంలోకి అడుగిడుతుంది అనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ మధ్య సితార నటించిన పీఎంజే జ్యువెల్స్‌ యాడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ప్రిన్సెస్‌’ ప్రివ్యూను శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ఆవిష్కరించగా అప్పుడు తన తల్లి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి హాజరైన ఆమె సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందని ఆమె ప్రకటించి హాట్ టాపిక్ అయింది. కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే సితార తండ్రికి తగ్గ తనయ అంటూ పేరు, తన మార్క్ ఐడెంటిటీని సంపాదించుకుని చిన్న వయసు నుంచే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సితార బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తుందంటే ఆమె టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Bigg Boss 7: ఒక రేంజిలో ఆడుకున్న నాగార్జున… అతను డైరెక్ట్ ఇంటికే?

ఇక తాజాగా తన తల్లి నమ్రతతో కలిసి హైదరాబాద్ కూకట్ పల్లి హోసింగ్ బోర్డులోని నెక్సస్ మాల్ లోని ఒక బొమ్మల కొలువు ఏర్పాటు చేయగా దాన్ని ఓపెన్ చేసేందుకు వెళ్ళింది. ఇక ఆమె అక్కడికి వచ్చిన సమయంలో ఆమెతో ఫోటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇక ఆ సమయంలో ఆమెతో ఫోటో దిగుతున్న ఒక బామ్మ ఆమె బుగ్గను గిల్లి ముద్దు పెట్టుకోవడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు స్టడీస్ పరంగా దృష్టి సారిస్తూనే మరో వైపు తనకిష్టమైన నటన, నాట్యం, డ్యాన్స్ సంబంధించిన వాటిలో శిక్షణ పొందుతోంది సితార. రీసెంట్‌గా ఆమె డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ఏ విధంగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

Exit mobile version