NTV Telugu Site icon

Raviteja: సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది… డైరెక్టర్ మాంత్రికుడేనా?

Raviteja

Raviteja

ఒక స్టార్ హీరో బర్త్ డే వచ్చింది అంటే ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి… ఆ హీరో నెక్స్ట్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి అనౌన్స్మెంట్లు రావడం, అప్డేట్లు రావడం మాములే. ఇలానే ఈరోజు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు రవితేజ నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి కూడా అప్డేట్స్ బయటకి వచ్చాయి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ ఉండగా… మాస్ మహారాజ అభిమానుల జోష్ ని మరింత పెంచుతూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రవితేజ నెక్స్ట్ సినిమా విషయంలో ఒక రూమర్ వినిపిస్తుంది. ఈ విషయంలో చిన్న హింట్ ఇస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 26వ సినిమాగా అనౌన్స్ అయిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు అనే విషయంలో క్లారిటి ఉంది కానీ డైరెక్టర్ ఎవరు అనే విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. కొంతమంది అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది కదా… పుష్ప 2 కంప్లీట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది కాబట్టి ఆ లోపు త్రివిక్రమ్ రవితేజతో సినిమా చేస్తాడు అనే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు సితార నుంచి వచ్చిన అప్డేట్ త్రివిక్రమ్-రవితేజ కాంబినేషన్ లో కాకుండా అనుదీప్ కేవీ-రవితేజ కాంబినేషన్ లో ఉండే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా రవితేజ కోసం అనుదీప్ కేవీ ఒక కథని రాసుకున్నాడు, రవితేజకి కూడా నచ్చింది అనే మాట వినిపిస్తూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ నే సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ఉంది. త్వరలోనే డైరెక్టర్ పేరుని అనుదీప్ కేవీగా రివీల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ అనుదీప్ కేవీ కాకుండా నిజంగానే త్రివిక్రమ్, రవితేజతో సినిమా చేస్తుంటే మాత్రం… త్రివిక్రమ్ డైలాగ్స్ కి రవితేజ డైలాగ్ డెలివరీ తోడైతే స్క్రీన్ పైన మ్యాజిక్ చూడడం గ్యారెంటీ.

Show comments