Sitara: సితార ఘట్టమనేని గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని యువరాణి, మహేష్ గారాల పట్టీగా సితార పుట్టినరోజునుంచే సెలబ్రిటీగా మారిపోయింది. ఇక సితారకు తల్లితండ్రి అంటే ఎంత ఇష్టమో నాన్నమ్మ, తాతయ్య అన్నకూడా ఆమెకు ప్రాణం. రెండు నెలల క్రితం నాన్నమ్మ మరణించినప్పుడు సీతూ పాపను ఆపడం ఎవరి తరం కాలేదంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా నేడు తాత కృష్ణ మృతితో సితార మరింత కుంగిపోయింది.
రెండు నెలల కాలంలోనే నాన్నమ్మ, తాతయ్యను పోగొట్టుకోవడం ముములు విషయం కాదు. ఇక తాత మృతిని తలుచుకొని సితార ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా తాత మీద ఉన్న ప్రేమను తెలుపుతూ భావోద్వాగానికి గురి అయ్యింది. “ఇకముందు వారాంతపు లంచ్ లు మునుపటిలా ఉండవు. తాతయ్య.. మీరు నాకు ఎన్నో విలువలు నేర్పించారు.. నన్ను ఎంతగానో నవ్వించారు. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలుగా మారిపోయాయి. . మీరు గర్వపడేలా ఒకరోజు నేను చేస్తానని నమ్మకం ఉంది. మిమ్మల్ని నేను ఎంతగానో మిస్ అవుతున్నాను తాతగారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
