Sirivennela: సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలో నిత్యం జీవించే ఉంటారు. ఇక తాజాగా నేడు సిరివెన్నెల కుటుంబం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్.శాస్త్రి ఆయనను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. సిరివెన్నెల అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు జగన్ తనవంతు సాయం చేశారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం జగన్ సర్కారు భరించింది. దీంతో తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సిరివెన్నెల కుటుంబం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Ambati Rambabu: పవన్ ఎంటర్ టైనర్ మాత్రమే.. జగన్ జనం మనసు గెలిచిన ధీరుడు
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని వారు జగన్ తో పంచుకున్నారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు జగన్ హామీ ఇచ్చారు, అంతేకాకుండా ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసిన పేపర్స్ ను వారికి అందించారు. ఇంత సహాయం చేసిన జగన్ ఋణం తాము తీర్చుకోలేమని వారు ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Read Also: CM KCR : రిపబ్లిక్ డే భారత పౌరులందరికీ పండుగ రోజు
