Site icon NTV Telugu

Sir: ధనుష్ ‘సార్’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మాస్టారు… మాస్టారు’

Sir

Sir

Sir: ధనుష్ హీరోగా శ్రీకర స్టూడియోస్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ సినిమాస్ కలసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సర్’ సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో విడుదల అయింది. జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను శ్వేతా మోహన్ పాడారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ ఫస్ట్ సింగిల్ మెలోడీగా సాగుతూ అందరినీ ఆకట్టుకునేలా సాగింది. హీరోయిన్ సంయుక్త మీనన్ భావంలో సాగే మెలోడి ఇది.

‘సీతాకాలం మనసు నీ మనసున చోటు అడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాట అడిగింది’… ఇకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే.. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నే కలగన్నట్లే నా పక్కన నిలిచారు.. ఇలాంటి పంక్తులతో అటు యువతను ఇటు పిన్నా, పెద్దలను అలరించే సాహిత్యంతో సాగిన ఈ పాట సూపర్ హిట్ పాటల్లో చోటు దక్కించుకోవడం ఖాయం అనేలా ఉంది. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాయికుమార్, భరణ, సుముతిరఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మిసాయి, హైపర్ ఆది, షరా, ఆడుకాలమ్ నరేన్, ఇలవరసు, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ ఇతర పాత్రలను పోషించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంలో పాటలను విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version