Site icon NTV Telugu

Sravana Bhargavi-Hema Chandra: విడాకుల రూమర్‌పై స్పందించిన సింగింగ్ కపుల్

Sravana Bhargavi

Sravana Bhargavi

గత కొన్ని రోజులుగా మీడియాలో సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ మౌనంగా భరిస్తూ వచ్చిన జంట ఎట్టకేలకు సోషల్ మీడియాలో స్పందించింది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయని, ఇద్దరు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారన్న రూమర్లకు చెక్ పెడుతూ ‘సెపెరేట్ అవుతున్నామనే న్యూస్ వచ్చినప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పాటు యూట్యూబ్ వ్యూస్ పెరిగాయని, మీడియా కథనాలతో తమకు ప్రయోజనమే చేకూరటం వల్లనే సైలెంట్ గా ఉన్నామని శ్రావణ భార్గవి తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

అటు హేమచంద్ర సైతం ‘తను పాడిన పాటల కంటే ఎక్కువ స్పీడ్ గా రూమర్స్ వ్యాప్తి చెందుతున్నాయని, అయితే వాటిలో నిజం లేదని’ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి శ్రావణభార్గవిని ట్యాగ్ చేశాడు. విడిపోలేదనే అంశాన్ని ఇద్దరూ విడి విడిగా పోస్ట్ చేయటంతో కొంత మందిలో ఇంకా అనుమానం తొలగిపోలేదు. వారి పోస్ట్ ల కింద నెటిజెన్స్ చేసిన కామెంట్స్ అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉందన్నది వాస్తవం. ఏది ఏమైనా ప్రేమించి పెళ్ళి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట కలసి మెలసి ఉండాలని కోరుకుందాం.

Exit mobile version