Site icon NTV Telugu

Singham Again: సింగం వీరులు మళ్ళీ మొదలెట్టారు!

Singham Again Started

Singham Again Started

Singham Again Mahuratham: బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లు ఆల్ టైం క్రేజ్ ఉంటుంది. అలాంటి హీరో, డైరెక్టర్ కాంబినేషన్ అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టిలది. అక్కడ అజయ్ దేవ్‌గణ్‌కు డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ కు మంచి క్రేజ్ వుంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. డైరెక్టర్ గా రోహిత్ శెట్టి ఫస్ట్ మూవీ జమీన్ లో హీరోగా నటించింది అజయ్ దేవగనే. ఈ మూవీలో అజయ్‌తో పాటు అభిషేక్ బచ్చన్ ఈ మూవీలో సెకండ్ హీరోగా యాక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఓ మాదిరి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘గోల్ మాల్’…బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టగా ఆ తర్వాత వచ్చిన ‘గోల్ మాల్ రిటర్స్స్,’ ‘గోల్ మాల్ 3’ లు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

Skanda: కల్ట్ మామా.. అంటే ఇదా.. ఇంకేదో అనుకున్నామే?

‘గోల్ మాల్ ఎగైన్’ అంటూ నాల్గో సీక్వెల్ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఇక సింగం సిరీస్‌తో కూడా అజయ్, రోహిత్ శెట్టిలు కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. సింగం సిరీస్‌లో మూడో సినిమాకు ‘సింగం ఎగైన్’ అనే టైటిల్ ఖరారు చేయగా ఈరోజు అధికారికంగా సినిమా ప్రారంభించారు. ఈసారి సినిమా స్టార్‌కాస్ట్ కూడా మునుపటి కంటే చాలా పెద్దదిగా ఉండబోతోంది. అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ ‘సింగమ్ ఎగైన్’ లాంచ్ విషయాలను షేర్ చేశారు. అర్జున్ కపూర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా హీరోయిన్ గా దీపికా పదుకొణె పేరు కూడా వినిపిస్తోంది కానీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

Exit mobile version