Site icon NTV Telugu

Singer Sunitha: పర్సనల్స్ రికార్డింగ్ స్టూడియోలో ఎందుకు మాట్లాడతారు.. సునీత ఎమోషనల్

Sunitha

Sunitha

Singer Sunitha: అందానికి అందం.. అంతకు మించిన గాత్రం ఆమె సొంతం. ఆమె పాట పాడిందంటే మైమరిచిపోని సంగీత ప్రియులు ఉండరు అంతే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు సునీత. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇక ప్రస్తుతం కొడుకును హీరోను చేసే పనిలో పడింది. సునీత కొడుకు ఆకాష్.. సర్కారు నౌకరి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా కోసం సునీత సైతం ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తోంది. ఇక ఈసారి ప్రమోషన్స్ కాకుండా ఒక పర్సనల్ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా ఆమెను ఇంటర్వ్యూ చేసాడు. ఇందులో ఆమె ఎక్కడా చెప్పని విషయాలను పంచుకుంది. ముఖ్యంగా ఆమె పర్సనల్ జీవితంపై వచ్చిన రూమర్స్, ఆరోపణలపై ఎమోషనల్ కూడా అయ్యింది. సునీత.. మూడేళ్ళ క్రితం రామ్ వీరపనేనని రెండో పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ఆమె.. కేవలం డబ్బు కోసమే రామ్ ను వివాహమాడిందని ఎంతోమంది విమర్శించారు. అయినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడింది. ఇక సింగర్ గా ఎదిగేసమయంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఫేక్ స్మైల్ చేస్తుందని, ఎక్కువ ఏడుస్తుంది అని అని విమర్శించేవారని ఆమె చెప్పుకొచ్చింది.

Dhruva Natchathiram : లిరికల్ సాంగ్, న్యూ పోస్టర్ తో సినిమా పై హైప్ పెంచుతున్న మేకర్స్..

ఇక ఆ విషయాల గురించి ఆమె మాట్లాడుతూ.. ” నీ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది అనిరికార్డింగ్ స్టూడియోలో అవసరం లేదు, నువ్వు నీ చెప్పులుని బయట వదిలేసి ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలి. గుడిలోకి వెళ్లప్పుడు చెప్పులు వదిలేసి వెళతారు గా.. అలాగే స్టూడియో లోకి వెళ్ళినప్పుడు కూడా అంతే. నీ లైఫ్ లో ఏం జరిగింది.. ఆ ముందు క్షణం వరకు ఎలా ఉన్నావ్, నువ్వు ఫైట్ చేస్తున్నావా, నువ్వు రిలేషన్ లైఫ్ లో ఉన్నావా. ఆది టాక్సికా.. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, అవసరం లేదు.. అవన్నీ సంబంధమే లేదు.. అన్నీ వదిలేసి స్టూడియోలోకి వెళ్ళాలి.అప్పుడే నువ్వు బతకలగలవు. నేను చాలా సెన్సిటివ్.. నేను ప్రతిదానికి ఏడుస్తాను. అలా ఏడవకపోతే నేను ఆర్టిస్ట్ నే కాదు. నాకు ఫేక్ స్మైల్ ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version