NTV Telugu Site icon

Mangli: మంగ్లీ క్రేజ్ మాములుగా లేదు.. పోలీసులు కూడా..

Singer

Singer

Mangli: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ జానపదాలు, భక్తి పాటలు పాడుతూ ఆమె ఫేమస్ అయింది. ఇక ఈ మధ్యన సినిమా అవకాశాలు కూడా రావడంతో స్టార్ సింగర్ గా మారింది. ప్రస్తుతం ఒకపక్క మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే ఇంకొ పక్క సింగర్ గా కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మంగ్లీ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంది. ఇక తాజాగా మంగ్లీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తూ కనిపించింది. కుటుంబంతో సహా ఆమె స్వామివారిని దర్శించుకొని.. ఆయన ఆశీస్సులను అందుకుంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

Pawan Kalyan: పోరాడితే పోయేదేం లేదురా.. ఎదవ బానిస సంకెళ్లు తప్ప..

ఇక శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో మీడియాతో ముచ్చటించింది. వరలక్ష్మీ వ్రతం రోజు ఇలా దర్శించుకోవడం ఆనందంగా ఉందని, శివుడి మీద చాలా పాటలు పాడాను.. వెంకన్న మీద పాటలు పాడాలనే కోరిక మాత్రం ఇంకా తీరలేదని చెప్పుకొచ్చింది. ఇక ఒక్కసారిగా తిరుమలకు మంగ్లీ రావడంతో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా పోలీసులు సైతం మంగ్లీ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఆమెను చుట్టుముట్టి పోలీసులందరూ సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మంగ్లీ క్రేజ్ మామూలుగా లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments