ఎన్టీవీ ఎంటెర్టైన్మెంట్ లో Music ‘N’ Play అనే కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సాకేత్ హోస్ట్ చేస్తున్న ఈషోలో ప్రముఖ సంగీత దర్శకులు, పాపులర్ సింగర్స్ పాల్గొని తమ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో సింగర్స్ దీపు, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా దీపు సింగర్ గీతా మాధురిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాను గీతా మాధురితో పాడను అంటూ చెప్పేశాడు. దానికి ఆయన చెప్పిన కారణం కూడా బాగానే ఉంది. గీతా మాధురి వాయిస్ తో పోటీ పడడం కష్టమని, స్టేజ్ పై ఆమె పక్కన నిలబడితే ఎవరూ కన్పించరు అంటూ చెప్పుకొచ్చారు. అందుకే గీతా మాధురితో పడడాన్ని అవాయిడ్ చేస్తానని వెల్లడించాడు.
Read Also : Bheemla Nayak : బావ సినిమాకి వచ్చా… పూనమ్ స్క్రీన్ షాట్ వైరల్
దీపు విషయానికొస్తే… ఆయన 40కి పైగా చిత్రాలలో పాడాడు. అతిది, యమదొంగ, చిరుత, మగధీర, గమ్యం మొదలైన సినిమాల్లో పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కీరవాణి, మణి శర్మ, కోటి, శ్రీలేఖ, ఘంటాడి కృష్ణ, మిక్కీ జె మేయర్, చక్రి మొదలైన అనేక మంది సంగీత దర్శకులతో పని చేశాడు.