NTV Telugu Site icon

Chinmayi: చిన్మయి చేతిలో అడ్డంగా బుక్కయిన నటుడు.. ఏం మగాళ్లు అంటూ

Chinmayi

Chinmayi

Chinmayi: టాలీవుడ్ లో సింగర్ చిన్మయి గురించి తెలియని వారుండరు. సింగర్ గా కంటే ఆడపిల్లకు కష్టం వచ్చిందంటే ముందుండే సామజిక వేత్తగా ఆమెకు మంచి పేరుంది. నిత్యం ఇండస్ట్రీలో ఆడవారికి జరిగే అవమానాలు గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాడుతూనే ఉంటుంది. ఇక ఎవరైనా వారిని కించపరిచేలా మాట్లాడితే మాత్రం వారిని సోషల్ మీడియాలో ఏకిపారేస్తూ ఉంటుంది. తాజాగా కోలీవుడ్ నటుడు సతీష్ చేసిన ఒక పని.. చిన్మయిని మరోసారి ఆడవారి గురించి మాట్లాడేలా చేసింది. ఇంతకూ అసలు విషయం ఏంటంటే.. శృంగార తార సన్నీ లియోన్, కోలీవుడ్ హీరోయిన్ దర్శన గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవలే నిర్వహిసిన్హారు.

ఇక ఈ ఈవెంట్ కు సన్నీ పద్దతిగా చీర కట్టుకురాగా.. దర్శన మోడ్రన్ డ్రెస్ లో వచ్చింది. ఇదే విషయాన్నీ సతీష్ కొంచెం వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు. ” ముంబాయ్ నుంచి వచ్చిన సన్నీ చీర కట్టుకొని పద్దతిగా వస్తే.. ఇక్కడే పెరిగిన అమ్మాయి మోడ్రన్ డ్రెస్ లో వచ్చింది చూడండి. నేను ఆమెను కించపరచడం లేదు.. పాయింట్ అవుట్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలకు అక్కడ ఉన్నవారందరూ నవ్వినా చిన్మయి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. “అంతమంది ఉన్న వేడుకలో ఒక స్త్రీని పాయింట్ చేసి ఆమె డ్రెస్ గురించి ఇలా పబ్లిక్ గా మాట్లాడమేంటి..? అక్కడ ఉన్నవారందరూ నవ్వడమేంటి..? మహిళల డ్రెస్ ల గురించి కామెంట్స్ చేసే ఇలాంటి మగాళ్లు ఎప్పుడు మారతారో” అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments