NTV Telugu Site icon

Chinmayi : రజినీ, కమల్ లపై కామెంట్స్… ముఖ్యమంత్రులనూ వదల్లేదుగా…!!

chinmai

chinmai

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు.

Read Also : Bheemla Nayak : థియేటర్లో తమన్ రచ్చ… వీడియో వైరల్

“స్త్రీలకు వేధించే వ్యక్తి పేరును బయట పెట్టడం ఎందుకు కష్టమో మీకు తెలుసా? ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి, గౌరవనీయులైన కేరళ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ, గౌరవప్రదమైన ఎంపీ కనిమొళితో కలిసి వేదికను పంచుకుంటానని వేధింపులకు కారణమైన వాడు చెప్పాడు. ప్లస్ మిస్టర్ కమల్ హాసన్, మిస్టర్ రజనీకాంత్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఈ దేశంలో మహిళల భద్రత గురించి తాము శ్రద్ధ వహిస్తున్నామని ఎవరైనా… ఎవరైనా చెబితే – ఈ ఈవెంట్‌కు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల నుండి హాజరవుతున్న ప్రముఖులను సెక్స్ నేరస్థుల గోతిలో ఎగిరి గంతేయమని అడగండి. వారు అనుభవం నుండి నేర్చుకుంటారు. ఈ దేశం, అనేక మంది రాజకీయ నాయకులు, స్త్రీలు, పురుషులు… ఎవరైనా వేధింపులకు పాల్పడితే పట్టించుకోవడం లేదు. 20 మంది మహిళలు అతని పేరును బయట పెట్టారు కూడా. ఇలాంటి దేశంలో మీ పిల్లలను బాగా పెంచండి ఆల్ ది బెస్ట్” అంటూ వ్యంగ్యంగా వరుస పోస్టులు చేసింది. ఈ దేశం అమ్మాయిలకు ఒక అగ్నిగుండంలా మారింది అంటూ ఓ నెటిజన్ కోపాన్ని ప్రదర్శించగా, “కాదు. ఈ దేశం మహిళలపై లైంగిక వేధింపుల గొయ్యి… ముఖ్యంగా రాజకీయంగా లైంగిక వేధింపులకు దేశం మద్దతు ఇస్తుంది” అంటూ చిన్మయి మండిపడింది.