సింగర్ చిన్మయి.. పరిచయం అక్కర్లేని పేరు.. మనసును హత్తుకొనే ఆమె వాయిస్.. అన్నింటికి మించి సోషల్ మీడియాలో కొన్ని అసమానతలను ఎత్తి చూపుతూ దైర్యంగా మాట్లాడే వ్యక్తి.. గతంలో మీటూ సమయంలో చిన్మయి చేసిన ఆరోపణలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు అంటే ఆదుకోవడానికి పనికి వచ్చే బొమ్మలు కాదని, వారికి ఒక మందు ఉంటుందని, వారి ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోవాలంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఒకయుద్ధాన్నే చేసింది. ఇప్పటికీ ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను ఎత్తుచూపుతూ .. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను తెలియజేస్తోంది.. తాజాగా మరోసారి చిన్మయి హాట్ కామెంట్స్ తో విరుచుకు పడింది.
అమ్మాయిలకు తల్లిదండ్రులు సేచ్ఛను ఇవ్వడంలేదంటూ బల్లగుద్ది చెప్పుకొచ్చింది. ” డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గురించి ఒక అవగాహన కార్యక్రమం ఉందనుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి చేయాలి. అవి చేయొద్దు. అని చెబుతారు. అంటే వారు తాగుతున్నారని కాదు.. ఎవరికి అవసరమవుతుందో వారు అర్ధం చేసుకుంటారని, తమ కూతురును గౌరవంగా బతికే ఛాన్స్ ని తల్లిదండ్రులు ఇవ్వడం లేదు.. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. నేను పెట్టె పోస్ట్లు చూసి ఎన్నారై లు మేము అలాకాదు జనరలైజ్ చేయకే.. అని వాగనక్కర్లేదు. నేను అమ్మాయిల గురించి చెప్తున్నాను.. వారికి అవసరమైతే తీసుకుంటారు.
తల్లిదండ్రులు కూతురికి కట్నం ఇచ్చి మరీ పెళ్లీ చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్రంగా బతకనివ్వరు. ఆర్థికంగా, స్వతంత్రంగా అమ్మాయిలు ఉంటే అవగాహనతో వేరే కాస్ట్ వారిని పెళ్లి చేసుకుంటారని భయం.. అబ్బాయి ఎంత వెధవ అయినా కానీ వారి క్యాస్ట్ వారైతే వెంటనే ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. ఈ స్టోరీస్ చూసి కొంతమంది అమ‍్మాయిలైన సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది నాకు చాలు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి ఘాటు కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
